full screen background image
Search
Tuesday 20 November 2018
  • :
  • :

జగదానంద కారకం “శ్రీరామనవమి పర్వదినం”

rama navami

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయా: పతయే నమ:

ఎల్ల లోకాలను ఏలే పరమాత్ముడు ఆ శ్రీమన్నారాయణుడు. ఎన్నో అవతారాల్లో స్వామి వారు భూమి మీదకు విచ్చేసి, ధర్మ ప్రతిష్టాపన గావించారు. వాటిలో మనిషిగా అవతరించి… మానవ ధర్మాన్ని లోకానికి చాటిచెప్పిన అవతారం రామావతారం. అందుకే మన దేశంలో రామాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు.

చైత్రమాసం ప్రారంభమయ్యాక వచ్చే తొలి పెద్ద పండుగ శ్రీరామనవమి. వసంతరుతువులో… చైత్రశుద్ధనవమి నాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని జననం జరిగింది. లోకకళ్యాణ కారకుడైన ఆ పరమాత్ముడు… సాక్షాత్తు మానవుడిగా ఉద్భవించి, ధర్మానికి కట్టుబడి, భగవంతుడయ్యి ఎన్నో శ్రమలకోర్చి మానవ ధర్మాన్ని పాటించి, ధర్మ ప్రతిష్టాపన గావించాడు.

ఇదే రోజున సీతారాముల కళ్యాణం, శ్రీరాముని పట్టాభిషేకం కూడా జరిగిందని ప్రజల విశ్వాసం. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాలు శ్రీరామ నవమి నాడు లోకకళ్యాణ కారకమైన సీతారామ కళ్యాణ ఘట్టంతో శోభిస్తాయి.

శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడం… జీవితకాలంలో నిలిచిపోయే ఓ దివ్యానుభూతి. ఈ కళ్యాణాన్ని వీక్షించడం వల్ల వివాహం కాని వారికి వివాహం అవుతుంది, వివాహం అయిన వారికి సత్సంతానం కలుగుతుంది. సంతానం ఉన్న వారికి తరాలకు నిలిచి పోయే పుణ్యం లభిస్తుంది. పుణ్యాత్ములకు ఆ పరమాత్ముని సాయుజ్యం లభిస్తుంది. జన్మకు ఇంతకంటే కావలసింది ఏముంది.

మనం కూడా ఆ సీతారాము కళ్యాణవైభవాన్ని చూసి తరిద్దాం.

  • 173
    Shares



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Close
error: Content is protected !!