full screen background image

పానకం, వడపప్పులోని ఆరోగ్య రహస్యాలు

sri rama navami health

శ్రీ రామనవమి నాడు సీతారాముల కళ్యాణం నిర్వహించి, అందరికీ వడపప్పు పానకాన్ని మహాప్రసాదంగా అందిస్తారు. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని చెబుతారు. వేసవికాలంలో అందించే ఈ ప్రసాదం వెనుక ఎన్నో ఆరోగ్య రహాస్యాలు ఉన్నాయి. ఈ ప్రసాదాన్ని సేవించండ వల్ల ఆరోగ్యం, ఆయువృద్ధి కలుగుతాయని వేదపండితుల భావన.

వసంత రుతువులో ఎండకారణంగా గొంతు సమస్యలు ప్రారంభం అవుతాయి. పానకంలో ఉపయోగించే ఏలకలు, మిరియాలు ఉపశమనాన్ని ప్రసాదించి ఔషదంలా పని చేస్తాయి. బెల్లంలో ఉండే బి12 విటమిన్ వేసవి దప్పికను తీరుస్తుంది.

పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. దేహకాంతిని పెంచుతుంది. బుధుడికి సంబంధించిన పెసరపప్పు జ్ఞానాన్ని కూడా పెంచుతుంది.

అందుకే శ్రీరామనవమి నాడు పానకం, వడపప్పు ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలే కాకుండా, లౌకిక ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయన్న విషయాన్ని గ్రహించి, మనమూ కూడా ఆ శ్రీరాముని ప్రసాదాన్ని సేవించి, ఆరోగ్యాన్ని పొందుదాం.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Close
error: Content is protected !!