full screen background image
Search
Tuesday 18 September 2018
  • :
  • :

పుట్టినరోజే శ్రీరామునికి పెళ్ళి వేడుకలా?

dharma

శ్రీరామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన పర్వదినం అని మనందరికీ తెలుసు. అయితే దేశవ్యాప్తంగా ఈ రోజే స్వామి వారి కళ్యాణ వేడుకలు నిర్వహిస్తారు. నిజానికి త్రేతాయుగంలో స్వామి వారి కళ్యాణం జరిగిన సమయం వేరే. అయితే ఇలా ఎందుకు నిర్వహిస్తారో తెలుసా….

దీనికి సంబంధించిన సమాధానం మనకు పురుషోత్తమ సంహిత అనే ఆగమ శాస్త్ర గ్రంథంలో కనిపిస్తుంది. లోకకళ్యాణ కారకుడైన పరమాత్ముడు భూమి మీద అవతరించిన రోజునే కళ్యాణం జరిపించాలి. ఒక వేళ ఆ తిథి తెలియకపోతే ఏకాదశి నాడు కళ్యాణం జరిపించాలి. అందుకే దేవతలందరికీ పుట్టిన రోజునే కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది.

పరమాత్ముని కళ్యాణం అంటే సాక్షాత్తు లోక కళ్యాణమే. పరమాత్ముడు జన్మించేది లోక కళ్యాణం కోసమే. అందుకే పరమాత్ముని అవతార తిథినాడే కళ్యాణం సమంజసం అనిపిస్తుంది.

 

  • 515
    Shares



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Close
error: Content is protected !!