full screen background image
Search
Tuesday 18 September 2018
  • :
  • :

ప్రసాదంలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలేవి…?

ప్రసాదం, నైవేద్యం పేరు ఏదైనా భగవంతునికి అర్పించి మనం తీసుకునే ఆహారం. ప్ర అంటే ఉత్కృష్టమైన, సాదం అంటే ఆహారం అనే అర్థాలు ఇందులో కనిపిస్తాయి. భగవంతునికి అర్పించిన ఏదైనా ఉన్నతమైనదేనని సనాతన భారతీయ ధర్మం విశ్వసిస్తోంది. అందుకే ప్రసాదం అంటే ప్రతి ఒక్కరికీ అంత ప్రీతి.

అదే విధంగా ప్రసాదంలో వాడే పదార్థాలు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. బెల్లం, మిరియాలు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఇంగువ, ఆవపిండి… ఇలా దేన్ని చూసినా, ఆరోగ్యానికి మేలు చేసేవే. అందుకే ప్రసాదాన్ని ముందుగా తీసుకుని తర్వాత ఆహారాన్ని తీసుకోమని పెద్దలు సూచిస్తారు. ఇలా చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగు కావడంతో పాటు… ఆహారంలో ఉండే చిన్న పాటి సమస్యలు, చిక్కులు తొలగిపోతాయని నమ్మిక.

అసలు మనం రోజూ తినవలసింది కూడా ప్రసాదమే. భగవంతునికి అర్పించి తినడం వల్ల ఆహారానికి గొప్పరుచిని, శక్తిని, దివ్యత్వాన్ని ఆ స్వామి అందిస్తాడని నమ్మకం. నిజానికి ప్రసాదం తీసుకునే తీరును గమనిస్తే మనకు ఈ విషయం అవగతం అవుతుంది. అరటి ఆకులో మనం వండిన ఆహారాన్ని తీసుకుని, దాన్ని ఆచమనం చేసి, స్వామికి సమర్పించి తింటాం. దీని వల్ల అందులో ఉండే విష పదార్థాలు నశిస్తాయి. చక్కని జీర్ణశక్తితో పాటు, ప్రసాదానికి మంచి రుచి కూడా చేకూరుతుంది.

ఒక్కో దైవానికి ఒక్కో రకమైన ప్రసాదాన్ని మన ధర్మం శాస్త్రం సూచిస్తోంది. మనం ఏది వండుకున్నా, ఏది తినబోతున్నా దాన్ని ఆ దేవుని ప్రసాదంగా భావించి, స్వామికి నైవేద్యం పెట్టి తీసుకోవడం వల్ల ఉపవాస ఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.

  • 30
    Shares



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Close
error: Content is protected !!