full screen background image
Search
Wednesday 17 October 2018
  • :
  • :

తిరుమల ఆనందనిలయం మరో చోట ఉందా…?

కోరి కొలిచిన వారి కొంగు బంగారం… తిరుమల శ్రీనివాసుడు. అలాంటి శ్రీనివాసుడు అభయముద్రతో కూర్చున్న భంగిమలో వెలసిన ఆలయం శ్రీకాళహస్తి సమీపంలో ఉంది. ఈ ఆలయ గర్భాలయం తిరుమల ఆనంద నిలయాన్ని పోలి ఉంటుంది. ఆకాశరాజు సోదరుడైన తొండమానుడే శ్రీనివాసుని ఆలయాన్ని నిర్మించినట్లు వేంకటాచల మహత్మ్యం తెలియజేస్తోంది. ఆయన నిర్మించిన ఆలయమే గనుక… ఈ ఆలయ గర్భగుడి సైతం ముమ్ముర్తులా తిరుమల గర్భాలయాన్ని పోలి ఉంటుంది.

ఒకప్పుడు ఈ ఊరే తొండమాన్ చక్రవర్తి సామ్రాజ్యం. ఇక్కడే ఆయన కోట ఉండేది. ప్రతి రోజూ స్వామి వారిని దర్శించుకునే తొండమానుడు వృద్ధాప్యం కారణంగా… తిరుమలకు వెళ్లలేకపోతే… స్వామి వారే ఆయన్ను చూడడానికి వచ్చే వారట. అలా… భక్తుడి కోసం భగవంతుడు ఉభయదేవేరి సమేతంగా ఇక్కడ వెలిశాడు. ఆతిథిగా వచ్చాడు గనుకే ఇక్కడ స్వామి కూర్చుని దర్శనమిస్తాడు. ఉభయ దేవేరులతో అభయహస్తంతో, యోగముద్రలో దర్శనమిచ్చే ఈ స్వామి వారు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తారని చెబుతారు. అంతే కాదు… అమ్మవార్లతో కలిసి ఉండే ఈ స్వామి దగ్గర కోరుకున్న ఏ కోరికైనా కచ్చితంగా తీరుతుందని నమ్మకం.

ఎలా చేరుకోవాలి…?

తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళే మార్గంలో తొండమాన్ పురం అనే గ్రామం ఉంది.

  • 19
    Shares



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Close
error: Content is protected !!